'దురంధర్ 2'కు షాక్.. తొలిరోజే పైరసీ

by Muthe.Rajitha |

భారీ అంచనాల మధ్య విడుదలైన 'దురంధర్ 2' సినిమా పైరసి సైట్లలో ప్రత్యక్షం కావడం కలకలం రేపింది.

దురంధర్ 2కు షాక్.. తొలిరోజే పైరసీ
X

దిశ, వెబ్ డెస్క్ : భారీ అంచనాల మధ్య విడుదలైన 'దురంధర్ 2' చిత్రానికి తొలిరోజే పైరసీ సెగ తగలడం సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గతంలో వచ్చిన మొదటి భాగం ఘనవిజయం సాధించడంతో, ఈ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, సినిమా థియేటర్లలో విడుదలైన కొన్ని గంటల్లోనే అనేక కీలక సీన్లు సోషల్ మీడియా సైట్లు, ఇల్లీగల్ వెబ్‌సైట్లు, టెలిగ్రామ్ గ్రూపుల్లో ప్రత్యక్షమవ్వడం చిత్ర యూనిట్‌కు పెద్ద షాక్ ఇచ్చింది. అయితే ఈ పైరసీ పాకిస్తాన్ లో జరిగిందని సమాచారం. అంతేకాదు అక్కడివారు ఈ చిత్రాన్ని టీవీల్లో వీక్షిస్తున్న వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నెలల తరబడి వేలాది మంది టెక్నీషియన్లు, నటీనటులు పడ్డ కష్టాన్ని మంచులా కరిగించేస్తూ, పైరసీ భూతం ఈ సినిమా వసూళ్లపై పంజా విసరడం పట్ల చిత్ర నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా ఈ చిత్రంలోని కీలకమైన క్లైమాక్స్ ట్విస్టులు మరియు హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు సోషల్ మీడియాలో లీక్ అవ్వడం వల్ల, సినిమా చూద్దామనుకునే సామాన్య ప్రేక్షకుల ఇంట్రెస్ట్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ పరిణామంపై చిత్ర బృందం వెంటనే స్పందిస్తూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పైరసీ లింకులను తొలగించేందుకు యాంటీ-పైరసీ బృందాలు రంగంలోకి దిగి నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.

Next Story