- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇదే నా ఫిట్నెస్ రహస్యం : డీజీపీ సీవీ ఆనంద్
తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తన ఫిట్‌నెస్ రహస్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తన ఫిట్‌నెస్ రహస్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఒక మీడియా కాన్క్లేవ్‌లో పాల్గొన్న ఆయన, పోలీసులకు విధుల్లో శారీరక దృఢత్వం అనేది ఎంత ముఖ్యమో వివరిస్తూ తన సొంత ఆరోగ్య రహస్యాన్ని వెల్లడించారు. తాను గత 32 ఏళ్లుగా కేవలం 75 నుంచి 76 కిలోల స్థిరమైన బరువును కొనసాగిస్తున్నానని, ఈ క్రమశిక్షణ వెనుక కఠినమైన ఆహార నియమాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా చక్కెర, ఉప్పు, రైస్, మైదా వంటి నాలుగు పదార్థాలను తన ఆహారం నుండి పక్కన పెట్టడం వల్లే ఈ వయసులో కూడా ఇంత ఫిట్‌గా ఉండగలుగుతున్నానని ఆయన గుట్టు విప్పారు.
పోలీసు శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరికీ ఫిట్‌నెస్ అనేది ప్రాథమిక అవసరమని, ఇది కేవలం విధులకు మాత్రమే కాకుండా వ్యక్తిగత ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని డీజీపీ అభిప్రాయపడ్డారు. సరైన ఆహార నియమాలను పాటించడం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడకుండా ఉండవచ్చని, తద్వారా జీవిత కాలాన్ని పెంచుకోవచ్చని ఆయన సూచించారు. నిరంతరం ఒత్తిడితో కూడిన విధుల్లో ఉండే పోలీసులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవరుచుకోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఒక ఉన్నతాధికారిగా ఆయన పాటిస్తున్న ఈ ఆరోగ్య సూత్రాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ అందరికీ స్ఫూర్తినిస్తున్నాయి.






