- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆషాఢంలో ఎల్లమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
by Ratna Kumari |
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం కనగల్ మండలంలోని ధర్వేశిపురం శ్రీ ఎల్లమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

X
దిశ, కనగల్ : ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం కనగల్ మండలంలోని ధర్వేశిపురం శ్రీ ఎల్లమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మొక్కులు తీర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు నాగోజు మల్లాచారి అర్చకత్వంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ నెలకొనగా, మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Next Story






