మహాశివైక్య యోగ అభిషేకం.. తరలివచ్చిన భక్తులు

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-13 09:12:46  IST  )

సోమవారం ఆరుద్ర నక్షత్రం మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి ఆలయంలో మహా శివైక్య యోగం అభిషేకాలు నిర్వహించారు.

మహాశివైక్య యోగ అభిషేకం.. తరలివచ్చిన భక్తులు
X

దిశ, మంగపేట: సోమవారం ఆరుద్ర నక్షత్రం మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి ఆలయంలో మహా శివైక్య యోగం అభిషేకాలు నిర్వహించారు. పడమర ముఖంలో దక్షిణ కాశీని పోలి ఉన్న శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు విస్సావజ్జల నరేష్ శర్మ ఆధ్వర్యంలో పంచామృతాలు, పవిత్ర గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకుడు నరేష్ శర్మ మాట్లాడుతూ.. సోమవారం ఆరుద్ర నక్షత్రం మాస శివరాత్రి 1999 జులైలో వచ్చిందని ఇలాంటి రోజు మళ్లీ 2053 సంవత్సరంలోనే ఇటువంటి మహద్భాగ్యం భక్తులకు కలుగుతుందన్నారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, దాంపత్య, వివాహం ఆలస్యం సమస్యలు ఉన్నవారు తప్పకుండా ఈ రోజు ఈ శివాలయాన్ని దర్శించి అభిషేకాల్లో పాల్గొంటే 100 శివరాత్రుల జాగరణ ఉపవాసం చేసిన ఫలితాన్ని ఇచ్చే అద్భుతమైన ఫలితాలు పొందుతారని అన్నారు.

Next Story