- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల నిలువు దోపిడీ
పేదల దేవుడిగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ దేవాలయమైన బద్ది పోచమ్మ ఆలయానికి వచ్చే భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దిశ, వేములవాడ : పేదల దేవుడిగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ దేవాలయమైన బద్ది పోచమ్మ ఆలయానికి వచ్చే భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలయంలో కొబ్బరికాయ కొట్టే భక్తుల నుంచి అక్కడి సిబ్బంది రూ.5 నుంచి రూ.10 వరకు అక్రమ వసూలు చేస్తున్నారంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో కొబ్బరికాయ కొట్టడానికి ఎలాంటి అధికారిక రుసుము లేకపోయినా, కొబ్బరి కాయలు కొట్టే ప్రదేశం వద్ద కొందరు వ్యక్తులు భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, ఈ వ్యవహారం పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, వారు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా ఆది, సోమ, శుక్రవారాల్లో వేలాది మంది మంది భక్తులు వచ్చే సమయంలో దొరికిందే ఛాన్సుగా కొబ్బరికాయ కొట్టే సిబ్బంది వందల రూపాయలు వసూలు చేస్తున్నారని, దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తమకు అదనపు భారం పడుతోందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆలయ అధికారులు స్పందించి బద్ధి పోచమ్మ ఆలయ ప్రాంగణంలో కొబ్బరికాయ కొట్టేందుకు ఎలాంటి రుసుము ఇవ్వవద్దని స్పష్టమైన బోర్డులు ఏర్పాటు చేయాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఆలయంలో కొబ్బరికాయ కొట్టే టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు అధిక డబ్బులకు ఆశపడి అక్రమ వసూళ్ళకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఇలా ప్రతి నెల సుమారు రూ.6 నుంచి 7 లక్షల వరకు ఆలయంలో అక్రమ వసూళ్ల దందా కొనసాగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ అక్రమ దందాలో కొంతమంది అధికారుల పాత్ర ఉన్నట్లు, వారి సహకారంతోనే ఆలయంలో అక్రమ వసూలు దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతున్నట్లు జోరుగా చర్చ జరుగుతుంది.






