నిజ జీవిత ఘటనల ఆధారంగా రాబోతున్న ‘దేవగుడి’

by Mallepaka Hamsa |

పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘దేవగుడి’(devagudi).

నిజ జీవిత ఘటనల ఆధారంగా రాబోతున్న ‘దేవగుడి’
X

దిశ, సినిమా: పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘దేవగుడి’(devagudi). ఈ సినిమాలో ఈ అభినవ శౌర్య(Abhinava Shaurya), నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె(Raghu Kunche) ప్రధాన పాత్రల్లో నటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ‘దేవగుడి’ సినిమా ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ఈక్రమంలో దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి, నటుడు రఘు కుంచె సినిమాకు సంబంధించిన పలు విషయాలు పంచుకున్నారు. దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఫ్యాక్షన్ నేపథ్యంలో ఇప్పటిదాకా మనకు చాలా సినిమాలు వచ్చాయి. 30 ఏళ్ల క్రితం ట్రెండ్ అది. అయితే మా మూవీలో ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నా, అది కొంత వరకే చూపించాం. మెయిన్ గా స్నేహం, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ మీద కథ ట్రావెల్ అవుతుంది. దేవగుడి వీరారెడ్డి పాత్రలో రఘు కుంచె గారు నటించారు.

మూవీలో 11 నిమిషాల ఒక స్పెషల్ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. దాంతో పాటు కొన్ని సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ప్లాన్ చేస్తూ వెళ్లాం. ఎక్కడా మూవీ ల్యాగ్ అనిపించదు. నిజ జీవిత ఘటనల ఆధారంగా మంచి కథా కథనాలతో ఈ సినిమాను రూపొందించాను. మా ‘దేవగుడి’ మూవీకి నార్మల్ టికెట్ రేట్స్ పెడుతున్నాం. సినిమా చూడాలని అనుకునే ప్రేక్షకులను ఎంకరేజ్ చేసేందుకు టికెట్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం. సినిమాకు వీళ్ల ద్వారా పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుందని ఆశిస్తున్నాం. నటుడు రఘుకుంచె మాట్లాడుతూ.. ఇందులో వీరారెడ్డి అనే పాత్రలో నటించాను. ఆయన ఆ చుట్టు పక్కల ఏరియాలో పవర్ ఫుల్ వ్యక్తి. నాకు పలాస సినిమా తర్వాత అలాంటి రోల్స్ వస్తున్నాయి. రాయలసీమ యాసలో డైలాగ్స్ చెప్పాను. ఈ సినిమా షూటింగ్ అంతా రియల్ లొకేషన్స్ లో చేశాం. దర్శకుడిగా ప్రతి సీన్ చాలా క్లారిటీగా రూపొందించారని అన్నారు.

Next Story