డిగ్రీ లెక్చరర్ ఫలితాల విడుదల: 20 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన

by Malleboina Mahesh |

ఏపీపీఎస్సీ డిగ్రీ లెక్చరర్ ఫలితాలు విడుదల. 290 పోస్టులకు గాను 300 మంది ఎంపిక; ఈ నెల 20 నుంచి 29 వరకు విజయవాడలో సర్టిఫికెట్ల పరిశీలన.

డిగ్రీ లెక్చరర్ ఫలితాల విడుదల: 20 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 290 లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించి 2025 జూలైలో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ రాత పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఏపీపీఎస్సీ బుధవారం ప్రకటించింది. 2023 డిసెంబరులో ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ, వివిధ కారణాల వల్ల పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదలలో జాప్యం జరిగింది. ముఖ్యంగా పోస్టుల రోస్టర్ విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల పరీక్ష జరిగిన పది నెలల వరకు ఫలితాలు నిలిచిపోయాయి.

కళాశాల విద్యాశాఖ నుంచి రోస్టర్ పై స్పష్టత రావడంతో కమిషన్ ఇప్పుడు ఫలితాలను వెల్లడించింది. తాజా ఫలితాల మేరకు మొత్తం 290 పోస్టులకు గాను 300 మంది అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు. విజయవాడలోని ఏపీపీఎస్సీ (APPSC) కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. ఈ సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన తర్వాత, 290 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తూ తుది ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Next Story