తృణమూల్ కాంగ్రెస్ లో ఫిరాయింపులు!

by Muthe.Rajitha |

తృణమూల్ కాంగ్రెస్ లో ఫిరాయింపులు!
X

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో మరో ప్రకంపన మొదలైంది. మే 7న పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ అధ్యక్షతన జరిగిన మొదటి కీలక సమావేశానికి సుమారు 10 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఎన్నికల్లో టీఎంసీ కేవలం 80 స్థానాలకే పరిమితం కావడంతో, పార్టీ బలహీనపడిందన్న సంకేతాల మధ్య ఈ ఎమ్మెల్యేల మిస్సింగ్ ఫిరాయింపుల (Defections) ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తోంది. ముఖ్యంగా బీజేపీ భారీ విజయం సాధించిన నేపథ్యంలో, అసంతృప్త ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనే చర్చ జోరుగా సాగుతోంది.

అయితే, ఈ ప్రచారాన్ని టీఎంసీ అధిష్టానం తీవ్రంగా ఖండించింది. గైర్హాజరైన ఎమ్మెల్యేలందరూ ముందస్తు అనుమతి తీసుకున్నారని వివరణ ఇచ్చింది. ముఖ్యంగా ఉత్తర బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల తదనంతర హింస చోటుచేసుకోవడంతో, ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే కొంతమంది నేతలు సమావేశానికి రాలేకపోయారని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. కేవలం 70 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరైనప్పటికీ, పార్టీ ఐక్యంగానే ఉందని మమతా బెనర్జీ కేడర్‌లో భరోసా నింపే ప్రయత్నం చేశారు.

Next Story