- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కల్తీ నూనె విక్రయాలపై ఉక్కుపాదం: డీసీపీ గైక్వాడ్ హెచ్చరిక
హైదరాబాద్‌లో విడి నూనె విక్రయాలపై నిషేధం! 15 రోజుల గడువు విధించిన పోలీసులు. నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్ రద్దు మరియు జైలు శిక్ష తప్పదని డీసీపీ హెచ్చరిక.

దిశ. వెబ్ డెస్క్: మహానగరం అయిన హైదరాబాద్‌లో గత కొంత కాలంగా కల్తీ నూనెల తయారీ (Manufacture of adulterated oils) విచ్చల విడిగా కొనసాగిస్తున్నారు. దీంతో కల్తీ నూనెల విక్రయాలను అరికట్టేందుకు H-FAST (Hyderabad Food Safety and Standards Team) బృందం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా బేగంబజార్‌లో నూనె వ్యాపారులతో నిర్వహించిన అవగాహన సదస్సులో సౌత్ జోన్ డీసీపీ గైక్వాడ్ (South Zone DCP Gaikwad) కీలక ఆదేశాలు జారీ చేశారు. నగరంలో విడి నూనె (Loose Oil) విక్రయాలపై పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తున్నామని, ప్రతి నూనె ప్యాకెట్‌కు తప్పనిసరిగా కంపెనీ సీల్ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం నిల్వ ఉన్న విడి నూనెను విక్రయించుకోవడానికి వ్యాపారులకు 15 రోజుల గడువు ఇస్తున్నామని, ఆ తర్వాత నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
నూనె రిఫైనరీలు, నిల్వ కేంద్రాలలో కచ్చితమైన పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలని, నాణ్యత విషయంలో రాజీ పడితే ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని అధికారులు పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా విడి నూనె విక్రయించినా లేదా కల్తీకి పాల్పడిన వారి వ్యాపార లైసెన్సులను తక్షణమే రద్దు చేయడమే కాకుండా, భారీ జరిమానా మరియు జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు. ప్రజలు కూడా నూనె కొనుగోలు చేసే సమయంలో ప్యాకెట్ సీల్ మరియు నాణ్యత పత్రాలను తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచించారు.






