- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోడు భూముల్లో చదును పనులు అడ్డుకున్న దర్గాపల్లి గ్రామస్తులు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, పెంచికల్‌పేట్ మండలం దర్గపల్లి గ్రామ పరిధిలోని పోడు భూముల్లో అటవీశాఖ అధికారులు ట్రాక్టర్ల సహాయంతో శనివారం భూములు చదును చేస్తుండగా, గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

దిశ, బెజ్జూర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, పెంచికల్‌పేట్ మండలం దర్గపల్లి గ్రామ పరిధిలోని పోడు భూముల్లో అటవీశాఖ అధికారులు ట్రాక్టర్ల సహాయంతో శనివారం భూములు చదును చేస్తుండగా, గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ బొట్టుపల్లి కృష్ణవేణి గ్రామస్తులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కృష్ణవేణి మాట్లాడుతూ.. స్థానిక గిరిజన రైతులు ఎన్నో సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములను వారి అనుమతి లేకుండా చదును చేయడం సరైంది కాదన్నారు. భూముల విషయంలో ప్రభుత్వం, సంబంధిత అధికారులు గ్రామస్తులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామస్తులు కూడా తమ సాగు భూములకు నష్టం కలిగించే చర్యలను సహించబోమని హెచ్చరించారు. దీంతో కొంతసేపు అక్కడ అటవీ అధికారులకు గ్రామస్తులకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.






