- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Daily Horoscope:ఈ రోజు(28-05-2026) 12 రాశుల ఫలితాలు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రాశి ఫలాలు సాధారణ గ్రహస్థితులపై ఆధారపడి ఉంటాయి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రాశి ఫలాలు సాధారణ గ్రహస్థితులపై ఆధారపడి ఉంటాయి. గ్రహాల సంచారం రాశి చక్రములోని 12 రాశుల పై ప్రభావం చూపుతుంది. ఈ తరుణంలో ఈ రోజు(గురువారం) 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోండి.
మేష రాశి
ఈ రాశి వారికి ఇవాళ ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగులకు కార్యాలయాల్లో శుభవార్తలు అందుతాయి. లక్ష్యసాధన విషయంలో ఏకాగ్రతతో మంచి ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
వృషభ రాశి
వృత్తి, ఉద్యోగ రంగాల్లో అనుకున్న విధంగా పనులు సఫలమవుతాయి. పై అధికారుల నుంచి మంచి సహకారం, ప్రశంసలు లభిస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. వేతనాలు పెరిగేందుకు లేదా అదనపు ఆదాయ మార్గాలు మెరుగుపడేందుకు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. వైవాహిక జీవితం బాగుంటుంది.
మిథున రాశి
సృజనాత్మక ఆలోచనలతో అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగుతుంది. అయితే, బడ్జెట్ విషయంలో కొద్దిగా నియంత్రణ అవసరం, అనవసర ప్రయాణాల వల్ల ధన వ్యయం సూచిస్తోంది. విద్యార్థులకు, కళా రంగానికి చెందిన వారికి శుభప్రదం.
కర్కాటక రాశి
ఈ రాశి వారికి ఈ రోజు బాగుంటుంది. ఆర్థిక విషయాలకు గ్రహబలం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్న ఆటంకాలు, అవరోధాలు తొలగిపోతాయి. భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి.
సింహ రాశి
ఈ రాశి వారికి ఇవాళ అనుకూలంగా ఉంటుంది. సంతోషంగా కాలం గడుపుతారు. ముఖ్యమైన విషయాల్లో శుభవార్తలు వింటారు. మీ ప్రతిభకు తోటివారి నుంచి ప్రశంసలు లభిస్తాయి. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ, అవసరానికి డబ్బు అందుతుంది.
కన్య రాశి
వృత్తిరీత్యా ఉన్న ఇబ్బందులను తెలివిగా అధిగమిస్తారు. అయితే కొన్ని విషయాల్లో మానసిక ఆందోళన కలగవచ్చు, కాబట్టి నిరుత్సాహపడకుండా ముందడుగు వేయండి. రహస్య శత్రువుల పట్ల కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. నూతన వ్యాపార ఆలోచనలు చేయడానికి ఇది శుభ సమయం.
తుల రాశి
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. అయితే ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండటానికి విలాసవంతమైన వస్తువుల కొనుగోళ్లకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించండి. నూతన పనులు ప్రారంభించేటప్పుడు ఆచితూచి అడుగు వేయాలి.
వృశ్చిక రాశి
ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. పెండింగ్‌లో ఉన్న ముఖ్యమైన పనులు పూర్తి కావడంతో పాటు ధన లాభం కలుగుతుంది. సమాజంలో ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. కుటుంబంలో చిన్నపాటి విభేదాలు రాకుండా మాటతీరు పై నియంత్రణ ఉంచుకోవడం శ్రేయస్కరం.
ధనుస్సు రాశి
ఈ రోజు మీకు చాలా అదృష్టకరంగా ఉంటుంది. తలపెట్టిన శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తువులను లేదా ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.
మకర రాశి
కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ధన ధాన్య వృద్ధి ఉంటుంది. విద్యార్థులు తాము ఆశించిన విజయాలను సాధిస్తారు. గృహంలో జరిగే కొన్ని సానుకూల మార్పులు మీకు మానసిక సంతృప్తిని ఇస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి.
కుంభ రాశి
తలచిన కార్యాలకు కొద్దిగా ఆటంకాలు ఎదురైనా, పట్టుదలతో పూర్తి చేస్తారు. సోదరులతో లేదా సన్నిహితులతో అనవసర వైరం ఏర్పడకుండా మెలగడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు మధ్యాహ్నం తర్వాత క్రమంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తులను అతిగా నమ్మవద్దు.
మీన రాశి
ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, సమయానికి భోజనం చేయడం ముఖ్యం. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. పిల్లల విషయంలో ఎక్కువ పట్టుదలకు పోకుండా శాంతంగా వ్యవహరించాలి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదు.






