- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త సినిమా చూస్తారా? మూవీ లింకుల పేరుతో సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం
సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరతీస్తున్నారు. థియేటర్లలో కొత్తగా విడుదలైన సినిమాలను ఉచితంగా చూపిస్తామంటూ ఆన్‌లైన్‌లో నకిలీ లింకులను సృష్టిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : సినిమా ప్రియుల ఆరాటాన్ని పెట్టుబడిగా మార్చుకుంటూ సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరతీస్తున్నారు. థియేటర్లలో, ఓటీటీలలో కొత్తగా విడుదలైన సినిమాలను ఉచితంగా చూపిస్తామంటూ ఆన్‌లైన్‌లో నకిలీ లింకులను సృష్టిస్తున్నారు. ఉచితంగా సినిమా దొరుకుతుందనే ఆశతో ఆ లింకులను క్లిక్ చేసే వారిని సైబర్ కేటుగాళ్లు తమ ఉచ్చులోకి లాగుతున్నారు. ఉచిత సినిమా కోసం యూజర్లు ఆ లింకులను క్లిక్ చేయగానే, సైబర్ నేరగాళ్లు స్ట్రీమింగ్ యాప్స్ తరహాలో ఉండే కొన్ని ప్రమాదకరమైన ఏపీకే (APK) ఫైళ్లను ఫోన్లలో డౌన్‌లోడ్ చేయిస్తారు. ఈ థర్డ్ పార్టీ యాప్‌లు ఇన్‌స్టాల్ అయ్యే సమయంలో ఫోన్‌లోని కాంటాక్ట్స్, గ్యాలరీ, ఎస్‌ఎమ్‌ఎస్ వంటి అన్ని రకాల కీలక అనుమతులను (Access) అడుగుతాయి. వినియోగదారులు సినిమా చూసే తొందరలో వీటికి అనుమతి ఇవ్వడం వల్ల, ఫోన్ యొక్క పూర్తి నియంత్రణ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోతుంది.
ఒక్కసారి ఫోన్ యాక్సెస్ దొరికిన తర్వాత, నేరగాళ్లు లోపల ఉన్న వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంకింగ్ వివరాలను సేకరిస్తారు. అంతేకాకుండా, ఫోన్‌కు వచ్చే ఓటీపీ (OTP)లను కూడా వారికి తెలియకుండానే తస్కరించి, బ్యాంకు ఖాతాల్లోని డబ్బును అందినకాడికి దోచేస్తుంటారు. ఇలాంటి మోసపూరిత లింకుల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, కేవలం అధికారిక ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలోనే సినిమాలు చూడాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.






