- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో పడిపోయిన పంటల సాగు.. సగం కూడా దాటని పరిస్థితి
వర్షాభావం కారణంగా తెలంగాణలో ఖరీఫ్ సాగు పడిపోయింది. 1.32 కోట్ల ఎకరాలకు గానూ కేవలం 15.10 లక్షల ఎకరాల్లోనే సాగు.. 17 జిల్లాల్లో కరవు ఛాయలు!

దిశ, తెలంగాణ బ్యూరో : ఖరీఫ్పంట కాలంలో ఎప్పుడూ లేని విధంగా అతి తక్కువ పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది. ఈ సీజన్లో రైతులు 1.32 కోట్ల ఎకరాల వరకు వివిధ రకాల పంటలు సాగు చేస్తారని అంచనా వేస్తే ఇప్పటివరకు 15.10 లక్షల ఎకరాల మాత్రమే సాగు అయిందని అధికారుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత వానాకాలం సీజన్లో జూన్చివరి నాటికి 28.41 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. ఇప్పటివరకు ఆశించిన మేరకు వానలు కురవకపోవడంతో సుమారు 13.31 లక్షల ఎకరాలు తక్కువగా పంటలు సాగయ్యాయి.
ఖరీఫ్‌లో వరి 65 లక్షల ఎకరాల్లో సాగు చేయవచ్చని అంచనా వేస్తే ఇప్పటివరకు 42 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు వేసినట్లు తెలుస్తోంది. పత్తి 48.93 లక్షల ఎకరాలకు ఇప్పటివరకు 12.70 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 5.21 లక్షల ఎకరాలకు 31,450, కందులు 6.69 లక్షల ఎకరాలకు 56,100, సోయాబీన్ 4.20 లక్షల ఎకరాలకు 25,220, జొన్న 50,730 ఎకరాలకు 4,120 ఎకరాలు, పెసర్లు 85,779 ఎకరాలకు 8,520 ఎకరాలు, మినుములు 32,903 ఎకరాలకు 3,891, చెరకు 59,275 ఎకరాలకు 21,315 ఎకరాల్లో మాత్రమే పంటలు వేశారు.
17 జిల్లాల్లో చినుకు జాడే లేదు..
ఇప్పటివరకు 17 జిల్లాల్లో చినుకు వాన పడలేదు. 13 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వితన్తాలు వేసేలా వర్షపాతం నమోదైంది. మరో 15 రోజుల వరకు వానలు కురువ కపోతే ఈ ఏడాది కరువగా ప్రకటించక తప్పదు. విత్తనాలు వేసిన జిల్లాలో కూడా రైతులు రెండు, మూడు జల్లులు కురిస్తే వేసిన పత్తి, వరి పంటలు చేతికొస్తాయని లేదంటే ఎండకు మాడిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సీజన్‌లో వ్యవసాయ శాఖ సాగు తగినట్లుగా 16.70 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు, 0.48 లక్షల మొక్కజొన్న, 95 లక్షల ప్రత్తి ప్యాకెట్లు, 1.35 లక్షల క్వింటాళ్ల సోయాచిక్కుడు విత్తనాలు అవసరమవుతాయని, వరిలో సన్న బియ్యం సాగు పెరిగే అవకాశమున్నందున విత్తనాలను అధికమొత్తంలో అందుబాటులో ఉంచారు. ఇటీవల ఏడు రకాల సన్నాలు వేయాలని చెప్పి విత్తనాల కొరత లేకుండా ప్రభుత్వం రైతు వేదికల్లో రైతులకు అందుబాటులో ఉంచింది.
సాగుకు కౌలు రైతులు దూరం..
ఒక పక్క వానలు లేక, మరోవైపు విత్తనాలు, యూరియా ధరలు భారీగా పెరిగాయి. అంతేకాదు భూమి కలిగిన పట్టాదారులు ఏడాదికి చెల్లించే కౌలు కూడా పెంచారు. ఈ ఏడు కూడా కూలీల కొరత కూడా రెట్టింపు అయింది. ఇన్ని సమస్యల మధ్య భూమి కౌలుకు తీసుకుని అప్పులు చేసి పంట పండించడం కంటే పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లడం ఉత్తమమనే ఆలోచనలో కౌలు రైతులు ఉన్నారు. రేవంత్ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి రైతు భరోసా, క్రాప్రుణాలు, ప్రకృత్తి విపత్తులకు నష్టం జరిగితే ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో వ్యవసాయానికి మొగ్గు చూపినట్లు రైతు సంఘాలు చెబుతున్నాయి. వరి సాగు చేస్తే కౌలు, ఎరువులు, దుక్కులు దున్నడం, వరినాట్లకు కూలీలు, వరి కోత, కేంద్రాలకు ధాన్యం తరలింపు వంటి ఖర్చులు ఒక ఎకరానికి రూ. 60 వేలు వస్తుంది. అదేవిధంగా పత్తి పంటకు సైతం ఎకరానికి రూ.81 వేలు పెట్టుబడి అవుతుండటంతో కౌలు రైతులు సాగుకు ముందుకు రావడం లేదు.
ఆరుతడి పంటలకే మొగ్గు..
ఈ సీజన్లోరైతులు వరి, పత్తి పంటలు కంటే ఆరుతడి పంటలు వేసేందుకు మొగ్గు చూపుతున్నారు. సరిపడా వానలు కురువకపోవడంతో కూరగాయలు, పండ్లు, నువ్వులు, పొద్దు తిరుగుడు, కుసుమలు, శనగ పంటలు వేస్తున్నారు. వీటితో అధిక ఆదాయం వస్తోందని నెలరోజుల నుంచి ఉద్యాన శాఖ ప్రచారం చేపట్టింది. ఈ ఏడాది నుంచి మార్కెట్సౌకర్యాలు మెరుగుపరుస్తున్నట్టు తెలిపింది. మొన్నటివరకు రైతులు కూరగాయలు, పండ్లు మార్కెట్‌కు తీసుకొచ్చినప్పుడే ధరలు పడిపోతాయి. అదే దళారులు మాత్రం రెండింతలు ధరలకు విక్రయిస్తున్నారు. అందుకే ఈసారి అలాంటి పరిస్థితులు రాకుండా ఉద్యాన శాఖ చర్యలు చేపడుతోంది.






