- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై.. రోహిత్, ధోని ఎంట్రీపై క్లారిటీ
ముంబై వర్సెస్ చెన్నై సమరం! టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్. ధోనీ, రోహిత్ శర్మ లేకపోవడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ప్రస్తుతం రివేంజ్ వీక్ కోనసాగుతోంది. ఈ క్రమంలో నేడు 44 మ్యాచ్ ముంబై, చెన్నై జట్ల మధ్య జరుగుతుంది. చెపాక్ స్టేడియం వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచులో టాస్ గెలిచిన ముంబై జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ అనంతరం రెండు జట్ల కెప్టెన్లు ఈ విధంగా స్పందించారు.
రుతురాజ్ గైక్వాడ్: మేము మొదట బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాము. వికెట్ బాగుంది. కానీ కొంచెం కఠినంగా ఉంది. జట్టులో పెద్దగా మార్పులు చేయలేదు. గత మ్యాచ్ లాగే ఇది కూడా బ్యాటింగ్ చేయడానికి కష్టమైన పిచ్. ఆత్మవిశ్వాసం విషయంలో అందరూ చాలా ముందున్నారు. పద్ధతిని అనుసరిస్తే, దాన్ని సరిగ్గా అమలు చేస్తే ఫలితం వస్తుందని ఆశిస్తున్నాము. గుర్జప్నీత్ సింగ్ స్థానంలో (రామకృష్ణ) ఘోష్, అకీల్ హుసేన్ స్థానంలో ప్రశాంత్ వీర్ జట్టులోకి వస్తున్నారని గైక్వాడ్ తెలిపారు.
హార్దిక్ పాండ్యా: మేము మొదట బ్యాటింగ్ చేస్తాము. ఇది మంచి పిచ్ లాగా కనిపిస్తుంది. గత మ్యాచ్‌లో మేము బ్యాటింగ్ చేసిన తీరును బట్టి, మా బ్యాటర్లకు పరుగులు చేయడానికి మరో అవకాశం ఇవ్వాలనుకుంటున్నాము. మేము మా అత్యుత్తమ క్రికెట్ ఆడాలి, అప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. వాతావరణం బాగుంది. లెగ్ స్పిన్నర్ (రఘు శర్మ) తన మొదటి మ్యాచ్ ఆడుతుండగా, అశ్వని స్థానంలో కృష్ణ తిరిగి జట్టులోకి వస్తున్నాడు అని పాండ్య తెలిపాడు.
రోహిత్, ధోనీ ఫ్యాన్స్ కు మళ్లీ నిరాశే
ఇదిలా ఉంటే భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మని గ్రౌండ్ లో చూసేందుకు వేలాది మంది అభిమానులు తరలి వచ్చారు. కానీ వారికి మళ్లీ నిరాశే ఎదురైంది. గాయం కారణంగా రోహిత్ గత కొన్ని మ్యాచులకు దూరంగా ఉంటుండగా, ధోని మాత్రం ఇంతవరకు ఒక్క మ్యాచులో కూడా ఆడలేదు. ఓ రిపోర్ట్ ప్రకారం చెన్నై చివరి నాలుగు మ్యాచుల్లో ధోని ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడే అవకాశం ఉందని తెలపగా ఈ రోజు జరిగే మ్యాచులోను ధోని తుది జట్టులో లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్ (w), రుతురాజ్ గైక్వాడ్ (సి), ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, జామీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్(w), సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), రాబిన్ మింజ్, ట్రెంట్ బౌల్ట్, క్రిష్ భగత్, జస్ప్రీత్ బుమ్రా, AM గజన్‌ఫర్






