- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. పార్టీ జెండాలతో రావొద్దన్న CSK!
నేడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో పార్టీ జెండాలతో మ్యాచ్ జరగనున్న చెపాక్ స్టేడియానికి రావొద్దని అభిమానులకు CSK రిక్వెస్ట్ చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా నేడు చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్ నేపథ్యంలో సిఎస్కే యాజమాన్యం అభిమానులకు ఒక వినూత్న రిక్వెస్ట్ జారీ చేసింది. స్టేడియంలోకి వచ్చే ప్రేక్షకులు ఎవరూ ఎటువంటి రాజకీయ పార్టీల జెండాలు, బ్యానర్లు లేదా రాజకీయ నినాదాలతో కూడిన ప్లకార్డులను తీసుకురావద్దని అధికారికంగా ప్రకటించింది.
అయితే నేడు తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారనే వార్తల నేపథ్యంలో, స్టేడియంలో భారీ ఎత్తున పొలిటికల్ ప్రదర్శనలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో క్రీడా స్ఫూర్తిని కాపాడేందుకు CSK యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. "అన్బుడెన్ (ప్రేమతో).. మా సూపర్ ఫ్యాన్స్‌కు ఒక చిన్న విన్నపం. క్రికెట్ అనేది ఒక పండుగ, దానిని రాజకీయాలకు అతీతంగా ఆస్వాదించండి. స్టేడియం లోపలికి కేవలం ఆటను ఆస్వాదించడానికి మాత్రమే రండి" అని యాజమాన్యం తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొంది.
స్టేడియం భద్రతా విభాగాలు కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నాయి. తనిఖీ సమయంలో ఎవరి వద్దైనా రాజకీయాలకు సంబంధించిన సామాగ్రి కనిపిస్తే వారిని గేటు వద్దే ఆపేస్తామని అధికారులు స్పష్టం చేశారు. కేవలం ఎల్లో జెండాలు, క్రికెట్ సంబంధిత నినాదాలను మాత్రమే అనుమతిస్తామని వెల్లడించారు. అయితే క్రికెట్ ప్రేమికులు మాత్రం CSK నిర్ణయంపై భగ్గుమంటున్నారు. స్టేడియంలోకి జెండాలు తీసుకు రావొద్దు అని చెప్పడానికి మీకు ఏం హక్కు ఉందని మండిపడుతున్నారు.






