మావోయిస్టుల కంచుకోట కర్రెగుట్టపై CRPF IG విక్రమ్ కీలక ప్రకటన

by Gantepaka Srikanth |

ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దుల్లోని ములుగు జిల్లా పామనూరు వద్ద సీఆర్పీఎఫ్ రెండో బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు.

మావోయిస్టుల కంచుకోట కర్రెగుట్టపై CRPF IG విక్రమ్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దు(Chhattisgarh-Telangana Border)ల్లోని ములుగు జిల్లా పామనూరు వద్ద సీఆర్పీఎఫ్ రెండో బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. వాజేడు మండలం మొరుమూరు నుంచి కర్రెగుట్టల(Karregutta)పైకి రోడ్డు నిర్మించారు. 2 నెలల్లోనే దాదాపు 12 కిలోమీటర్ల రోడ్డును భద్రతా బలగాలు నిర్మించాయి. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ ఐజీ విక్రమ్(CRPF IG Vikram) మీడియాతో మాట్లాడారు. మావోయిస్టుల కంచుకోట అయిన కర్రెగుట్టలను అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కాగా, దట్టమైన అడవులతో కూడిన ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు మావోయిస్టు సీనియర్లకు సురక్షితమైన స్థావరంగా భావించేవారు. అయితే, మావోయిస్టుల నిర్మూలనలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌-మే నెలల్లో కర్రెగుట్ట కొండల చుట్టూ ఉన్న దట్టమైన అడవుల్లో కేంద్ర, రాష్ట్ర భద్రతాదళాలు 21 రోజుల సమగ్ర ఆపరేషన్‌ను నిర్వహించి 31 మంది మావోయిస్టులను అంతమొందించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టడానికి, భద్రతాదళాల ఆపరేషనల్‌ సామర్థ్యాలను మెరుగుపరచడానికి, అలాగే, గ్రామస్థులకు అత్యవసర సేవలు కల్పించడంలో ఈ క్యాంపు దోహదపడుతుందని చెప్పారు. అడవుల్లో ఆపరేషనల్‌ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఈ ప్రాంతాన్ని ప్రత్యేక శిక్షణ కేంద్రంగానూ అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు.

Next Story