- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 8 గంటల సమయం
తిరుమలలో 20 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 8 గంటల సమయం. నిన్న శ్రీవారి ఆదాయం రూ.3.59 కోట్లు.

దిశ, వెబ్ డెస్క్: పరీక్షలు ముగియడంతో పాటు ఫలితాలు విడుదల కావడంతో కలియుగ వైకుంఠ దైవం కొలువుదీరిన తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం తిరుమల కొండపై ఉన్న వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం (SSD) కోసం సుమారు 8 గంటల సమయం పడుతోంది. అలాగే రూ.300/- శీఘ్రదర్శనం టికెట్లు ఉన్న భక్తులకు 3 నుండి 4 గంటల వ్యవధిలో దర్శనం పూర్తవుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే నిన్న ఆదివారం కావడంతో భక్తుల రద్ధీ భారీగా కొనసాగింది. దీంతో నిన్న ఒక్కరోజే 77,743 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూ 30,276 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు హుండీ ద్వారా సమర్పించిన కానుకల రూపంలో నిన్న రూ.3.59 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ నిరంతరాయంగా పానీయాలు, అన్నప్రసాదాలు పంపిణీ చేస్తోంది. భక్తులు తమ వంతు వచ్చే వరకు సహనంతో ఉండాలని టీటీడీ అధికారులు అలర్ట్ జారీ చేశారు.






