- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ: శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
కలియుగ దైవం వేంకటేశ్వరుడి పుణ్యక్షేత్రం అయిన తిరుమల తిరుమలలో భక్తుల రద్దీ ప్రస్తుతం సాధారణంగా కొనసాగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: కలియుగ దైవం వేంకటేశ్వరుడి పుణ్యక్షేత్రం అయిన తిరుమల తిరుపతి (Tirumala Tirupati)లో భక్తుల రద్దీ ప్రస్తుతం సాధారణంగా కొనసాగుతోంది. స్వామి వారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు 15 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం (SSD) లభించడానికి సుమారు 8 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులకు క్యూలైన్లలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నారు.
ఇదిలా ఉంటే నిన్న ఒక్కరోజే శ్రీవారిని మొత్తం 72,637 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ క్రమంలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ.4.51 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ సాధారణం గానే ఉన్నప్పటికీ, వారాంతం కావస్తుండటంతో రానున్న రోజుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.






