- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాయకుడు మాసూమ్ శర్మ పై క్రిమినల్ కేసు నమోదు
గాయకుడు మాసూమ్ శర్మపై డెహ్రాడూన్‌లో కేసు నమోదు! కాలేజీ ఈవెంట్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు. పోలీసులు విచారణ చేపట్టారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ హర్యానా జానపద గాయకుడు మాసూమ్ శర్మ (Singer Masoom Sharma)కు ఊహించని షాక్ తగిలింది. డెహ్రాడూన్‌లోని దలన్‌వాలా పోలీస్ స్టేషన్‌లో ఆయనపై క్రిమినల్ కేసు (criminal case) నమోదైంది. ఏప్రిల్ 1వ తేదీన డీఏవీ (పీజీ) కాలేజీ లో నిర్వహించిన ఒక సాంస్కృతిక కార్యక్రమంలో ప్రదర్శన ఇస్తూ, వేదికపై నుంచి ఆయన అభ్యంతరకరమైన భాషను వాడారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రాంచల్ నౌని అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. సదరు కార్యక్రమంలో గాయకుడు ప్రవర్తించిన తీరు, ఆయన వాడిన పదజాలం అక్కడ ఉన్న విద్యార్థులు, సామాన్య ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు.
డెహ్రాడూన్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు కీలక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సెక్షన్ 296 కింద అశ్లీల చర్యలు, పాటలు పాడటం.సెక్షన్ 352 కింది శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా అవమానించడం. సెక్షన్ 79 కింద మహిళల గౌరవానికి భంగం కలిగించే పదాలు, చేష్టలు చేయడం సెక్షన్ 351(3) క్రిమినల్ బెదిరింపుల కింద కేసులు నమోదు చేశారు. మాసూమ్ శర్మపై ఎఫ్ఐఆర్ నమోదైన విషయాన్ని డెహ్రాడూన్ పోలీసులు ధృవీకరించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, చట్టపరమైన నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒక ప్రజా కార్యక్రమంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు ఇలా ప్రవర్తించడం సరికాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.






