తాషాను మోసం చేసిన ప్రభాస్ .. న్యాయం కోరుతున్న నెటిజన్స్

by Disha Web |
తాషాను మోసం చేసిన ప్రభాస్ .. న్యాయం కోరుతున్న నెటిజన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పీరియాడిక్ ల‌వ్ స్టోరిగా తెరకెక్కిన 'రాధే శ్యామ్‌' ఆశించించనంత విజయం సాధించలేక పోయింది. ప్రభాస్ లాంటి హీరోతో పూర్తిగా లవ్ స్టోరీ తీయడమేంటని విమర్శలు కూడా వచ్చాయి. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన హ‌స్త‌సాముద్రికా నిపుణుడైన 'కీరో' జీవితం ఆధారంగా చిత్రీకరించిన రాధేశ్యామ్ సినిమాలో విక్ర‌మాదిత్య అనే పాత్ర‌లో ప్రభాస్ క‌నిపించాడు.

కాగా, రాధే శ్యామ్ చిత్రంలో విక్రమాదిత్యని మొదట తాషా అనే విదేశీ అమ్మాయి ప్రేమిస్తుంది. తన జీవితంలో పెళ్లి రేఖ లేదని ఆ అమ్మాయి ప్రేమను కాదంటాడు హీరో. అయితే అతను ప్రేరణను (పూజా హెగ్డే) చూడగానే లవ్‌లో పడిపోతాడు. నిజానికి హీరోకి ప్రేమ, పెళ్లి జీవితం అనేవి లేవు అని తెలుసు. కానీ ప్రేరణను చూసి లవ్‌లో పడ్డాడు. చివరికి హీరోయిన్ స్వచ్ఛమైన ప్రేమతో వారిద్దరూ ఒకటవుతారు. అయితే ఇక్కడ కొంత మంది విక్రమాదిత్యకు ప్రేమ జీవితం ఉంటే, ఆ ప్రేమను మొదట తాషాకు పంచాలని "జస్టిస్ ఫర్ తాషా" అనే మీమ్‌ని క్రియోట్ చేస్తూ ఎగతాళి చేస్తున్నారు. ఈ క్రేజీ మీమ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.

Next Story

Most Viewed