- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై సీపీఎం సీరియస్
ఖమ్మం కొణిజర్ల మండల పరిధిలోని బోడియాతండా ప్రభుత్వ పాఠశాలలో 38 మంది, వనపర్తి జిల్లా కొత్తకోట ప్రభుత్వ బాలికల కళాశాలలో 30 మంది విద్యార్థులు కలుషిత ఆహారం వల్ల అస్వస్థతకు గురవ్వడం అత్యంత దురదృష్టకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆందోళన వ్యక్తంచేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఖమ్మం కొణిజర్ల మండల పరిధిలోని బోడియాతండా ప్రభుత్వ పాఠశాలలో 38 మంది, వనపర్తి జిల్లా కొత్తకోట ప్రభుత్వ బాలికల కళాశాలలో 30 మంది విద్యార్థులు కలుషిత ఆహారం వల్ల అస్వస్థతకు గురవ్వడం అత్యంత దురదృష్టకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని, ఒక విచారణ కమిషన్ ఏర్పాటు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండు నెలల క్రితమే హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి, మాదాపూర్, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌లో కలుషిత ఆహారం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం మరవకముందే మళ్ళీ ప్రస్తుతం ఖమ్మం, వనపర్తి జిల్లాల్లో చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నదని, ఇది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడడమేనని అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
పులిసిపోయిన పెరుగు, కుళ్ళిపోయిన కూరగాయలు
రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లు, గురుకుల్లో హాస్టళ్ల నిర్వహణలోపం, పర్యవేక్షణ కొతర, పరిశుభ్రత లోపం, కలుషిత నీరు తదితర కారణాలతో పాటు, ఉప్మారవ్వ, పులిసిపోయిన పెరుగు, కుళ్ళిపోయిన కూరగాయలు, నాసిరకం పప్పులు, ముక్కిపోయిన బియ్యం పెట్టడం వల్లనే ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు పదే పదే జరుగుతున్నాయని తెలిపారు. ఇలాంటి ఘటనలపై గతంలో హ్యుమన్‌రైట్స్ కమిషన్ తీవ్రంగా స్పందించిందని గుర్తుచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ హాస్టల్స్‌కు చెల్లించాల్సిన బిల్లులను పూర్తిగా చెల్లించాలని, ఘటనలకు కారణమవుతున్న అధికారులపై, కాంట్రాక్టు సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.






