- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పద్దతి మారకుంటే.. పొత్తు రద్దు చేస్తాం : కాంగ్రెస్ పార్టీకి సీపీఐ హెచ్చరిక
పద్దతి మారకుంటే పొత్తు రద్దు చేసుకుంటామని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ‘కాంగ్రెస్ పార్టీ పొత్తు ధర్మాన్ని పాటించడంలేదు. కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారని ఎగతాళి చేస్తున్నారు. కమ్యూనిస్టుల సత్తా ఎంటో కొత్తగూడెంలో చూూపించాం. పద్దతి మార్చుకోకుంటే పొత్తు రద్దు చేస్తాం. పొత్తు ఉండాలా? వద్దా? అనేది కాంగ్రెస్ పార్టీలో చేతిలోనే ఉంది’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో రెండు రోజుల పాటు పార్టీ రాష్ట్ర సమితి సమావేశం జరిగింది. జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్యపద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఇ.టి.నరసింహా, కార్యదర్శి వర్గ సభ్యులు కళవేన శంకర్, బాల నర్సింహ్మాలతో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూనంనేని సాంబశివరావు రాష్ట్ర సమితి నిర్ణయాలను వెల్లడించారు. పేదలకు ఇళ్ల , ఇళ్ల స్థలాలు, ఖమ్మం(వెలుగుమట్ల), హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మార్చి 24న ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న అమెరికా, ఇరాన్‌ల సామ్రాజ్యవాద కాంక్షను వ్యతిరేకంగా, పెరిగిన గ్యాస్, నిత్యావసరాల ధరలను అదుపు చేయటంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీపీఐ పెద్ద ఎత్తున ఉద్యమించబోతోందని స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డితో తేల్చుకుంటాం…
తమతో మిత్రధర్మం పాటించే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి తేల్చుకుంటామని సాంబశివరావు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండున్నర ఏళ్ల కావొస్తున్నా ప్రజా సమస్యలు పరిష్కారంలో జాప్యం కారణంగా రాష్ట్రంలో పూర్తిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్కరి సమస్యలను పట్టనట్లుగా వ్యవహారిస్తోందని, ఇక మీదట అది చెల్లబోదన్నారు. రైతు బంధు కు సంబంధించిన ఇప్పటికే ఒక దఫా పెండింగ్‌లో ఉండగా, రెండవ దఫా సమయం కూడ మించి పోయిందన్నారు. ప్రభుత్వం అసలు రైతు బంధు వేస్తుందా? వేయదా? స్పష్టం చేయాలని సాంబశివరావు డిమాండ్ చేశారు. ప్రతి అంశంపై పూర్తి సమాచారం స్పష్టం చేయాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.
సింగరేణిపై శ్వేత పత్రం విడుదల చేయాలి…
తెలంగాణకు గుండెకాయలాంటి సింగరేణి సంస్థను అసలు ఆసంస్థలో ఏమి జరుగుతోందో తెలియని పరిస్థితినెలకొందని కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. లాభాల్లో ఉంటే సింగరేణి సంస్థ పాలకులు అనాలోచిత నిర్ణయాలు మీతిమిరిన రాజకీయ జోక్యంతో నష్టాల్లోకి నెట్టివేస్తున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే సింగరేణిపై శేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా సింగరేణిని కాపాడుకునేందుకు అధికార యూనియన్ ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు బస్సు యాత్ర చేపట్టనుందని వీటిని సిపిఐ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.
యుద్దంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మౌనం వీడాలి…
అమెరికా యుద్ద చర్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తక్షణమే మౌనం వీడి, ఇరాన్‌పై అమెరికా - ఇజ్రాయిల్ దేశాలు చేస్తున్న యుద్దాన్ని ఖండించాలని కూనంనేని డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మన దేశ అంతర్గత విషయాలల్లో పదే పదే జోక్యం చేసుకుంటున్నా 140 కోట్లు దేశ ప్రజలకు ప్రతినిధి అయిన ప్రధాని నరేంద్ర మోదీ మౌనం దాల్చడం దేశ ప్రజలకే సిగ్గుచేటుగా ఉందన్నారు. అమెరికా పట్ల ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహారిస్తున్న తీరును చివరికి బిజెపి అభిమానులు సైతం అసహ్యించుకుంటున్నారని అన్నారు.
పార్టీ ఫిరాయింపులకు సీపీఐ వ్యతిరేకం..
పార్టీ ఫిరాయింపులకు సీపీఐ పూర్తిగా వ్యతిరేకమని కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. దానిని ఏ పార్టీ పొత్సహించినా తప్పేనన్నారు. అసలు పార్టీ ఫిరాయింపుల చట్టంలోనే లోపాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఎవరు పార్టీ ఫిరాయించిన తక్షణమే వారి సభ్యత్వం రద్దు అయ్యేలా కఠిన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పార్టీ ఫిరాయింపులకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఎల్‌ఎలకు సంబందించిన అంశంలో స్పీకర్‌కు ఉన్న విశే షాధికారాలను ప్రశ్నించలేమని, అదే సమయంలో నైతికత అంశం కూడా ఉంటుందన్నారు. ఈ అంశంలో న్యాయస్థానాలు సైతం స్పీకర్ నిర్ణయానికి వదిలివేసిన విషయాన్ని ఈ సందర్భంగా కూనంనేని గుర్తు చేశారు.






