హరీష్ రావును మళ్లీ విచారిస్తాం: CP సజ్జనార్

by Gantepaka Srikanth |

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత హరీష్ రావును విచారించినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు.

హరీష్ రావును మళ్లీ విచారిస్తాం: CP సజ్జనార్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో బీఆర్ఎస్ నేత హరీష్ రావును విచారించినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్(CP Sajjanar) వెల్లడించారు. మంగళవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘హరీష్ రావు కుమారుడు అమెరికా వెళ్తున్న కారణంగా.. ముందుగా వెళ్లేందుకు అనుమతి ఇచ్చాం. ఈ కేసులో ఎవరినీ ప్రభావితం చేయొద్దని హరీష్ రావుకు సూచించాం. హరీష్ రావుకు సుప్రీంకోర్టులో స్టే రాలేదు. అవసరమైతే హరీష్ రావును మళ్లీ విచారణకు పిలుస్తాం’ అని సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, నేడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పర్యవేక్షణలోని సిట్ బృందం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆయన్ను ఏడు గంటలకు పైగా సుదీర్ఘంగా ప్రశ్నించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీ (SIB) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు విచారణలో వెల్లడించిన సమాచారం ఆధారంగానే హరీష్ రావును సిట్ పిలిపించినట్లు తెలుస్తోంది. హరీష్ రావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు కావడంతో, గత ప్రభుత్వంలో జరిగిన ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన పాత్రపై అధికారులు లోతుగా ఆరా తీశారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన హరీష్ రావు.. ఈ నోటీసులు, విచారణ అంతా సీఎం రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామాగా కొట్టిపారేశారు.

Next Story