ఆవు ప్రతీకారం.. వీడియో వైరల్

by Muthe.Rajitha |

ఓ ఆవు ట్రాక్టర్ డ్రైవర్ పై ప్రతీకారం తీర్చుకునే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆవు ప్రతీకారం.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : ఓ ఆవు ట్రాక్టర్ డ్రైవర్ పై ప్రతీకారం తీర్చుకునే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సీసీసీ కార్నర్ వద్ద జరిగిన ఓ విచిత్రమైన ఘటన నెట్లో సంచలనం సృష్టిస్తోంది. రోడ్డుపై ఉన్న ఆవుల గుంపు వైపు ఒక ట్రాక్టర్ వేగంగా రావడంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయాల్సి వచ్చింది. దీంతో ఆవులు భయపడగా, ఒక ఆవు మాత్రం తీవ్రంగా కోపం వచ్చి ట్రాక్టర్‌ను వెంబడించింది. జాతీయ రహదారి మీద ఆవు ట్రాక్టర్‌ను ఛేజ్ చేస్తుండటాన్ని చూసిన అక్కడి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటనను అక్కడే ఉన్న ఓ వాహనదారుడు తన మొబైల్ ఫోన్‌లో వీడియోగా చిత్రీకరించగా.. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతూ చర్చనీయాంశంగా మారింది.

Next Story