TVK విజయ్ విడాకుల కేసు వాయిదా.. రూ. 250 కోట్ల భరణం అడుగుతున్న భార్య..?

by Malleboina Mahesh |   (  Updated:2026-04-20 13:15:17  IST  )

నటుడు, TVK అధినేత విజయ్ విడాకుల కేసును కోర్టు జూన్ 15కు వాయిదా వేసింది. విజయ్ దంపతులు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.

TVK విజయ్ విడాకుల కేసు వాయిదా.. రూ. 250 కోట్ల భరణం అడుగుతున్న భార్య..?
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నవ వేళ TVK విజయ్ విడాకుల కేసు (TVK Vijay's divorce case) సంచలనంగా మారిన విషయం తెలిసిందే. రాష్ట్ర రాజకీయాల్లో, చిత్ర పరిశ్రమలో సంచలనం రేపుతున్న తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ విడాకుల వ్యవహారం ఈ రోజు కోర్టు నిర్ణయంతో మరో మలుపు తిరిగింది. విజయ్, ఆయన భార్య సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం జూన్ 15కు వాయిదా వేసింది. అలాగే తదుపరి విచారణకు విజయ్, సంగీత ఇద్దరూ తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉంటే ఈ విడాకుల సెటిల్‌మెంట్‌లో భాగంగా సంగీత దాదాపు రూ. 250 కోట్ల భరణం ఆశిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. గత 25 ఏళ్లుగా అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య మనస్పర్థలు రావడంతో సంగీత చెంగల్‌పట్టు కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఒక ప్రముఖ నటితో విజయ్ సన్నిహితంగా ఉండటమే ఈ విబేధాలకు కారణమని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో విజయ్ వ్యక్తిగత జీవితంలోని ఈ పరిణామాలు రాజకీయంగానూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఆస్తుల వివరాల్లో తేడాలు: టీవీకే చీఫ్‌ విజయ్‌కు మద్రాస్‌ హైకోర్టు షాక్

Next Story