శాసన మండలి భవన పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించిన మండలి చైర్మన్

by Muthe.Rajitha |

తెలంగాణ శాసన మండలి భవన పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

శాసన మండలి భవన పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించిన మండలి చైర్మన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ శాసన మండలి భవనం పునర్నిర్మాణ పనులను ఖచ్చితంగా శాసన మండలి బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ ఆవరణలో ఉన్న భవనంలోనే నిర్వహించాలని సీఎం ఆదేశించారని, పనుల్లో ఆలస్యం చేస్తే కాంట్రాక్టు పనులు రద్దు చేస్తామని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హెచ్చరించారు. పనుల్లో ఎలాంటి జాప్యం చేయకుండా, వేగం పెంచాలని, త్వరగా భవనాన్ని పూర్తి చేసి శాసన మండలి అధికారులకు అప్పగించాలని ఆయన సూచించారు. తెలంగాణ శాసన సభ ప్రాంగణములోని తెలంగాణ శాసన మండలి భవనం పునర్నిర్మాణ పనులను గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం పర్యవేక్షించారు. శాసన మండలి సెక్రెటరీ నరసింహా చార్యులు, ఆర్ అండ్ బి, అగాఖాన్ సంస్థ తదితర అధికారులతో కలిసి జరుగుతున్న పనులపై గుత్తా సుఖేందర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ పక్కనే ఉన్న ఈ భవనంలోనే నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. త్వరలోనే శాసన మండలి హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారనిర, తాజాగా ఇప్పటి వరకు పూర్తి అయిన పనుల గురించి ఆయన ఆరా తీశారని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అతి త్వరలోనే శాసన మండలి హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగనున్నదని మండలి చైర్మన్ గుత్తా చెప్పారు.

Next Story