రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేనే లేదు.. మాజీ మంత్రి హరీశ్‌ రావు హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-28 14:34:01  IST  )

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, బీజేపీకి అసలు స్థానమే లేదని మాజీ మంత్రి హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేనే లేదు.. మాజీ మంత్రి హరీశ్‌ రావు హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, బీజేపీకి అసలు స్థానమే లేదని మాజీ మంత్రి హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నగరంలోని తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ రాష్ట్రంలో మళ్లీ గెలవదని వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎంగా మళ్లీ కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారనడానికి ఆరూరి రమేష్ చేరిక ఒక సంకేతమని ఆయన అన్నారు. తనకు తెలిసి కాంగ్రెసోళ్లు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు లైన్లు కడతారని, కానీ ఎవరినీ పడితే వారిని తీసుకోబోమని, ముఖ్యంగా కాంగ్రెస్ దొంగలను చేర్చుకోమని స్పష్టం చేశారు. అసలైన ఉద్యమకారులు, కరడుగట్టిన కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ సొంతమని, వచ్చే ఎన్నికల్లో తమ గెలుపును ఆపే శక్తి ఎవరికీ లేదని ధీమా వ్యక్తం చేశారు. ఆరూరి రమేశ్ చేరిక వర్ధన్నపేట మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడానికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. రమేశ్ అన్ని విషయాల్లో అనుభవజ్ఞుడని, సంయమనం పాటించే వ్యక్తి అని, పాత, కొత్త కార్యకర్తలను, నాయకులను కలుపుకొని వెళ్తాడనే నమ్మకం తనకు ఉందని హరీశ్ రావు పేర్కొన్నారు.

Next Story