- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ ఎంపీ సూర్జేవాలాకు సీఎం భార్య పాస్‌పోర్ట్ వివాదంలో సమన్లు
అస్సాం సీఎం భార్య పాస్‌పోర్ట్ వివాదంలో కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సూర్జేవాలాకు గౌహతి క్రైమ్ బ్రాంచ్ సమన్లు జారీ చేసింది. మే 23న హాజరుకావాలని ఆదేశం.

దిశ, వెబ్ డెస్క్: అస్సాం సీఎం భార్య పాస్‌పోర్ట్ వివాదంలో కాంగ్రెస్ ఎంపీ సూర్జేవాలా (Congress MP Surjewala)కు క్రైమ్ బ్రాంచ్ (Crime Branch) షాక్ ఇచ్చింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భుయాన్ శర్మ పాస్‌పోర్ట్ వివాదంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ రణదీప్ సింగ్ సూర్జేవాలా కు సమన్లు జారీ చేయడం జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం రేపింది. ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన పాస్‌పోర్ట్, ఇతర అధికారిక పత్రాల కేటాయింపులపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. ఈ వివాదంలో సూర్జేవాలా విడుదల చేసిన కొన్ని పత్రాలు, చేసిన వ్యాఖ్యలపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అస్సాం పోలీసులు (Assam Police) దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నెల 23వ తేదీన గౌహతిలోని క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు స్వయంగా హాజరుకావాలని సూర్జేవాలాను ఆదేశించారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ముగిసిన వెంటనే ఈశాన్య రాష్ట్రంలో కాంగ్రెస్ జాతీయ స్థాయి కీలక నేతకు సమన్లు జారీ కావడం రాజకీయంగా పెద్ద దుమారానికి దారితీసింది. ఈ చర్యను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా 'రాజకీయ కక్షసాధింపు' (Political Vendetta) గా అభివర్ణిస్తూ తీవ్రంగా ఖండిస్తోంది. అయితే, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, రాజకీయాలకు దీనికి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. ఈ సమన్ల వ్యవహారంతో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ మధ్య పొలిటికల్ మైండ్ గేమ్ మరింత ముదిరి అస్సాం రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెంచింది.






