ఖమ్మంలో ఈసారి నేనే పోటీ చేస్తా: రేణుకా చౌదరి

by Gantepaka Srikanth |

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఖమ్మంలో ఈసారి నేనే పోటీ చేస్తా: రేణుకా చౌదరి
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి(Renuka Chowdhury) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. పేదల హక్కులను కాలరాసే హక్కు ప్రధాని మోడీకి ఎవరు ఇచ్చారని ఫైర్ అయ్యారు. ప్రజలు బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తే.. అప్పుడు మోడీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అంతేగాకుండా.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి తానే బరిలో ఉంటానని తేల్చి చెప్పారు. నా గెలుపును ఆపే దమ్ము కేటీఆర్‌(KTR)కు ఉందా? అని సవాల్ చేశారు. అనంతరం మహిళల బట్టలపై జరుగుతున్న వివాదంపైనా రేణుకా చౌదరి స్పందించారు. మహిళలు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పడానికి మీరు ఎవరు? అని సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మహిళల అణగదొక్కాలని ఎవరూ చూసినా.. వారికి తగిన గుణపాఠం చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.

Next Story