- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM రేవంత్ విప్లవకారుడు: కాంగ్రెస్ ఎంపీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ క్రమ శిక్షణా సంఘం చైర్మన్, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై తెలంగాణ కాంగ్రెస్ క్రమ శిక్షణా సంఘం చైర్మన్, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి(MP Mallu Ravi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రతీ ఇంటికి చేరుతున్నాయని చెప్పారు. తెలంగాణలో ఇప్పుడు సామాజిక న్యాయం జరుగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక వైద్యుడు, సామాజిక విప్లవకారుడు అని మల్లు రవి కొనియాడారు. రేవంత్ రెడ్డి పాలన వందేళ్ల పాటు వర్ధిల్లాలని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని విమర్శించారు. ప్రజలు వారిని నమ్మడం లేదని అన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికలతో పాటు మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే ప్రూవ్ అయిందని అన్నారు. ఇక తెలంగాణలో బీజేపీకి అవకాశం లేదని చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 12 ఏళ్లకు పైగా అవుతున్నా.. తెలంగాణ అభివృద్ధికి ఒక్క రూపాయి నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు బీజేపీ నమ్మే పరిస్థితుల్లో లేరు అని అన్నారు.






