స‌త్యహ‌రిశ్చంద్రుడిలా క‌ల‌రింగ్ వద్దు.. కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సైటైర్

by Gantepaka Srikanth |

కేటీఆర్‌కి ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ నోటీసుల అంశంపై మానకొండూరు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పందించారు.

స‌త్యహ‌రిశ్చంద్రుడిలా క‌ల‌రింగ్ వద్దు.. కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సైటైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేటీఆర్‌కి ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ నోటీసుల అంశంపై మానకొండూరు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పందించారు. కేటీఆర్.. చ‌డీచ‌ప్పుడు లేకుండా సిట్ ముందు హాజ‌రై అడిగిన ప్రశ్నల‌కు స‌మాధానం చెప్పు.. అధికారులు నిబంధ‌న‌ల ప్రకారం నీకు నోటీసులు ఇచ్చారు.. హాజ‌రు కావ‌డానికి త‌గిన స‌మ‌యం కూడా ఇచ్చారన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎందుకు వ‌చ్చిందో, ఎలా వ‌చ్చిందో నీకు బాగా తెలుసు.. స‌త్యహ‌రిశ్చంద్రుడిలా, అమాయ‌క‌పు చ‌క్రవ‌ర్తిలా క‌ల‌రింగ్ ఇస్తున్నావు.. గ‌త ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ఎందుకు, ఎవ‌రి కోసం చేశారో తెలంగాణ ప్రజ‌లంద‌రికీ తెలుసని మేడిపల్లి సత్యం అన్నారు. ట్యాపింగ్ క‌ర్త, క‌ర్మ, క్రియా మొత్తం క‌ల్వకుంట్ల కుటుంబ‌మే.. ట్యాపింగ్ ల‌బ్ధిదారులు కేసీఆర్, కేటీఆర్, హ‌రీష్ రావులు అని ఆయన ఆరోపించారు.

మీ సొంత కుటుంబ స‌భ్యులు కూడా మీరు ట్యాపింగ్ చేశార‌ని చెపుతున్నారు.. ట్యాపింగ్ లో మీరు క‌ట‌క‌టాల వెనక్కి వెళ్లడం.. జైలు ఊచ‌లు లెక్కపెట్టడం ఖాయమని మేడిపల్లి సత్యం అన్నారు. మొన్న హ‌రీష్ రావు సిట్ విచార‌ణ త‌ర్వాత గంభీర‌మైన స్పీచ్‌లు దంచికొట్టారని, బ‌య‌ట బ‌ట్టలు చింపుకోవ‌డం.. లోప‌లికి పోగానే కాళ్ల బేరానికి రావ‌డం.. మీ క‌థ అంతా తెలంగాణ ప్రజ‌ల‌కు తెలుసని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు సిట్ పేరుతో నోటీసులు ఇస్తున్నార‌ని ప‌నికి మాలిన స్పీచ్‌లు దంచుతున్నారు.. ఇప్పుడు స‌చ్చిన పాములు మీరు.. మ‌మ్మల్ని చూసి మేం భ‌య‌ప‌డ‌త‌మా? అని మేడిపల్లి సత్యం అన్నారు. మీ మాట‌ల‌ను, మిమ్మల్ని తెలంగాణ ప్రజ‌లు ప‌ట్టించుకోవ‌డం మానేశారు. వ‌చ్చే ప‌దేళ్లు సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటారన్నారు.

Next Story