కేటీఆర్ చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే

by Gantepaka Srikanth |

సీఎంని తిడితే పెద్దోడిని అవుతానని కేటీఆర్ అనుకుంటున్నారని, తాము తల్చుకుంటే కేటీఆర్‌కు మించిన తిట్లు తిట్టగలం.. కానీ మా పార్టీ మాకు సంస్కారం నేర్పిందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.

కేటీఆర్ చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎంని తిడితే పెద్దోడిని అవుతానని కేటీఆర్ అనుకుంటున్నారని, తాము తల్చుకుంటే కేటీఆర్‌కు మించిన తిట్లు తిట్టగలం.. కానీ మా పార్టీ మాకు సంస్కారం నేర్పిందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి ఉండటాన్ని కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని, రేవంత్ రెడ్డికి, కేటీఆర్‌కి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. సోమవారం సీఎల్పీ మీడియా సెంటర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. సీఎం పైన మాట్లాడే స్థాయి, నైతికత కేటీఆర్‌కు లేదని, సీఎంని తిట్టే రాక్షసానందం పొందే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు.. ప్రజల్లో కేటీఆర్ చులకన అవుతున్నారన్నారు.

కేటీఆర్ చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు

ఏ ఎన్నిక వచ్చినా విజయం కాంగ్రెస్ పార్టీదే విజయమని, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 70 శాతం పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది.. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 శాతం సీట్లను గెలవబోతుందన్నారు. కేటీఆర్ తనకు తాను చాలా ఎక్కువ ఊహించుకుంటున్నాడు.. బీఆర్ఎస్ పని ముగిసింది.. ఆ పార్టీ చేతిలో మరోసారి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరని మేడిపల్లి సత్యం అన్నారు. ఇంకో దశాబ్దం వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుంది.. రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారు.. ఆయన నాయకత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు.. బీఆర్ఎస్, బీజేపీ కలిసి వచ్చినా, ఇంకొందరిని కలుపుకుని గుంపుగా వచ్చినా సీఎంని కదిలించలేరన్నారు. కవిత అన్ని విమర్శలు చేస్తుంటే కుక్కిన పేనులా కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు.. మీరు ఏమీ తప్పు చేయకపోతే కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మేడిపల్లి సత్యం డిమాండ్ చేశారు.

బీజేపీకి పేర్లు మార్చడం తప్ప వేరే రాజకీయాలు లేవు: మాజీ ఎంపీ వీహెచ్

బీజేపీ వాళ్లకు పేర్లు మార్చడం తప్ప వేరే రాజకీయాలు లేవని, పేదల కోసం ఆ పార్టీ ఒక్క పని చేయలేదని మాజీ ఎంపీ వీ.హన్మంతరావు మండిపడ్డారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం దేశ స్వరాజ్యం అని చెప్పిన మహాత్మా గాంధీ పేరు ఈ దేశానికి పెట్టాలని పెరియార్ అన్నారని, పేదలకు ఎంతో ఉపాధి ఇచ్చే పథకం పేరును గాంధీ పేరుతో పెట్టాలని సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్‌లు ఎంతో ఆలోచించి పెట్టారన్నారు. ఆ పథకం పేరును మార్చడం విచారకరమన్నారు.

Next Story