రాష్ట్ర ప్రజలకు చిన్న జీయర్ క్షమాపణ చెప్పాలి: యువజన కాంగ్రెస్

by Dishanational1 |
రాష్ట్ర ప్రజలకు చిన్న జీయర్ క్షమాపణ చెప్పాలి: యువజన కాంగ్రెస్
X

దిశ, వనస్థలిపురం: తెలంగాణలో ఎంతో భక్తితో కొలిచే వనదేవతలు సమ్మక్క, సారలమ్మపై వ్యాఖ్యలు చేసిన చిన జీయర్ స్వామి.. రాష్ట్ర ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని యువజన కాంగ్రెస్ ఎల్బీనగర్ నియోజకవర్గ నేతలు డిమాండ్ చేశారు. ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ వనస్థలిపురం సీఐ సత్యనారాయణకి గురువారం ఫిర్యాదు చేశారు. చిన్న జీయర్ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారీ అని విమర్శించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్రం శ్యామ్ చరణ్ రెడ్డి, ఉపాధ్యక్షులు జైపాల్ రెడ్డి, శివ కుమార్, నాయకుడు స్వామి పాల్గొన్నారు.

Next Story

Most Viewed