- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాఫియా శక్తులు రాజ్యమేలుతున్నాయి
కాంగ్రెస్ ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలన అట్టర్ ఫ్లాప్‌గా మారి రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజలు నష్టపోయారని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు విమర్శించారు.

దిశ, ఆమనగల్లు: కాంగ్రెస్ ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలన అట్టర్ ఫ్లాప్‌గా మారి రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజలు నష్టపోయారని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు విమర్శించారు. అచ్చంపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తున్న హరీష్ రావుకు హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై ఆమనగల్లులో బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫియా శక్తులు రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ వైఫల్యాల కారణంగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, మండల అధ్యక్షుడు అర్జున్ రావు, కౌన్సిలర్లు రాము, రమేష్, సర్పంచులు శ్రీను, సత్యం, నాయకులు ఖలీల్, సైదులు, నిరంజన్, ప్రసాద్, పరమేష్, గణేష్, వర్షిత్ తదితరులు హరీష్ రావుకు స్వాగతం పలికారు.






