- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: కేసీఆర్ విచారణపై ఓ అంచనాకు వచ్చిన సిట్?
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణపై సిట్ అధికారులు ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణపై సిట్ అధికారులు ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం న్యాయ నిపుణులతో సిట్ అధికారులు భేటీ అయి సుధీర్ఘంగా చర్చించారు. కేసీఆర్‌ను ఎక్కడ విచారణ జరపాలనే అంశంపై ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. లీగల్ ఒపీనియన్ తర్వాత కొత్త తేదీతో రెండోసారి నోటీసులు ఇవ్వడానికి నిర్ణయించారు. మరోవైపు.. ఇప్పటివరకు విచారణకు హాజరైన వారందరూ పేర్కొన్న అంశాలు, దర్యాప్తులో వెలుగుచూసిన విషయాల ఆధారంగా కేసీఆర్‌ను విచారించడానికి సిట్ అధికారులు సిద్ధమైన విషయం తెలిసిందే.
ఎవరి నిర్ణయాలు?
దీంతో పాటు ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును రిటైర్ అయిన తర్వాత మళ్లీ అదే స్థానంలో ఓఎస్డీగా ఎలా నియమించారు? రిటైరైన అధికారికి ఇంటెలిజెన్స్ విభాగం బాధ్యతలు ఎందుకు అప్పగించారు? రాధాకిషన్‌రావు రిటైరైన తర్వాత కూడా ఏళ్ల తరబడి కొనసాగడానికి కారణాలేమిటి? ఇవి పోలీసు ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాలా? లేక మీరు చెబితేనే వారు ఆదేశాలిచ్చారా?’ తదితర ప్రశ్నలు కేసీఆర్‌కు సంధించేందుకు సిట్ అధికారులు సిద్ధమైనట్టు సమాచారం. కేసీఆర్ విచారణ తర్వాత తుది ఛార్జీషీట్ దాఖలు చేయనున్నారు. దీనికి ముందే మరోసారి కేటీఆర్, హరీశ్, సంతో్‌షను సిట్‌విచారించొచ్చని తెలుస్తోంది.






