- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజావాణిలో విద్యుత్ ఏఈపై ఫిర్యాదు
మండలంలోని పలు గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న విద్యుత్ శాఖ ఏఈ శివశంకర్‌పై చర్యలు తీసుకోవాలని తిమ్మాపూర్, వట్టిపల్లి గ్రామస్తులు సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

దిశ, జగదేవపూర్ : మండలంలోని పలు గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న విద్యుత్ శాఖ ఏఈ శివశంకర్‌పై చర్యలు తీసుకోవాలని తిమ్మాపూర్, వట్టిపల్లి గ్రామస్తులు సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తిమ్మాపూర్ గ్రామంలో ఇండ్లపై నుంచి త్రీఫేజ్ విద్యుత్ లైన్లు వెళ్లడం వల్ల వర్షాకాలంలో విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం ఉందని, గత మూడు నెలలుగా సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వట్టిపల్లి గ్రామంలో సింగిల్ ఫేజ్ విద్యుత్ లైన్ ఇండ్లపై నుంచి వెళ్లడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని, వెంటనే ఆ వైర్లను తొలగించాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన విద్యుత్ సమస్యలను పరిష్కరించడంలో ఏఈ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన గ్రామస్తులు, ఆయన్ను మండలం నుంచి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులైన పేదలకు ప్రొసీడింగ్స్ మంజూరు చేయాలని కోరారు. సర్వే సమయంలో అర్హులైన పలువురి పేర్లు ఎల్-3 జాబితాలోకి వెళ్లడంతో వారికి ఇళ్లు మంజూరు కాకుండా పోతున్నాయని తెలిపారు. ఈ విషయమై ఎంపీడీవో, జిల్లా కలెక్టర్‌కు ఇప్పటికే వినతిపత్రాలు సమర్పించినప్పటికీ, వెరిఫికేషన్ నివేదికలు కలెక్టర్ లాగిన్‌లో పెండింగ్‌లో ఉండటంతో ఇప్పటి వరకు ప్రొసీడింగ్స్ జారీ కాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ సర్పంచ్ రాజు, వట్టిపల్లి ఉపసర్పంచ్ నాగరాజు, సుధాకర్, స్వామి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.






