- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాఘవ్ చద్దాకు వెల్లువెత్తుతున్న మద్దతు!
రాజ్యసభలో పార్టీ డిప్యూటీ నేతగా ఉన్న రాఘవ్ చద్దాను ఆప్ తొలగించడం తీవ్ర చర్చకు దారి తీసింది.

దిశ, వెబ్ డెస్క్ : రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) డిప్యూటీ లీడర్ గా ఉన్న గొంతుకగా రాఘవ్ చద్దాను ఆ పదవి నుంచి తొలగించడం సంచలనంగా మారింది. ఆయన స్థానంలో పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్ను కొత్త డిప్యూటీ లీడర్‌గా నియమిస్తూ ఆప్ నాయకత్వం రాజ్యసభ సెక్రటేరియట్‌కు అధికారిక లేఖ పంపారు. కేవలం పదవి నుంచి తొలగించడమే కాకుండా, సభలో పార్టీ కోటా సమయాన్ని కూడా ఆయనకు కేటాయించవద్దని కోరడం రాఘవ్ చద్దాకు పార్టీ అధిష్టానం మధ్య విభేదాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో స్పష్టం చేస్తోంది. 2023 నుండి ఈ బాధ్యతల్లో ఉన్న చద్దా, టెలికాం ఛార్జీల పెంపు, డేటా ఎక్స్‌పైరీ, గర్ల్ ఎడ్యుకేషన్, మహిళల ఆరోగ్యం వంటి సామాన్యుల సమస్యలను పార్లమెంట్‌లో బలంగా వినిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, గత కొంతకాలంగా పార్టీ కీలక వ్యవహారాలకు ఆయన దూరంగా ఉండటం, స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చోటు దక్కకపోవడం వంటి పరిణామాలు ఈ ఆకస్మిక ఉద్వాసనకు దారితీశాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. "నిజాయితీగా సామాన్యుల పక్షాన నిలబడిన వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా?" అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చాలా మంది ఆయనను "ఆప్ అసలైన స్ఫూర్తి" అని కొనియాడుతున్నారు. రాఘవ్ చద్దా ఇంకా ఎంపీగా కొనసాగుతున్నప్పటికీ, పార్టీ లోపల నెలకొన్న ఈ అంతర్గత అసంతృప్తి భవిష్యత్తులో ఆప్ రాజకీయ సమీకరణాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా యువతలో మంచి క్రేజ్ ఉన్న నాయకుడిపై ఇలాంటి చర్య తీసుకోవడం పార్టీ క్యాడర్‌లో కూడా చర్చకు దారితీసింది.
- Tags
- raghav chadha
- AAP






