మగాడు ఎట్లైనా బతుకుతడు కానీ ఆడది?.. కమిట్‌మెంట్ ట్రైలర్

by sudharani |
మగాడు ఎట్లైనా బతుకుతడు కానీ ఆడది?.. కమిట్‌మెంట్ ట్రైలర్
X

దిశ, ఫీచర్స్ : తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, అమిత్ తివారి, శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'కమిట్‌మెంట్'. ఫూట్‌లూస్ ఎంటర్‌టైన్మెంట్స్, ఎఫ్3 ప్రొడక్షన్స్ బ్యానర్లపై బల్దేవ్ సింగ్ సింగ్, నీలిమ తాడూరి నిర్మించిన చిత్రానికి లక్ష్మీకాంత్ దర్శకత్వం వహించారు. రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒక అప్‌కమింగ్ యాక్ట్రెస్, సెక్సాలజిస్ట్, టీనేజర్, జూనియర్ డాక్టర్, స్టూడెంట్.. తమ కెరియర్‌ కోసం ఎదుర్కొన్న సమస్యల చుట్టే ఈ కథ ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత సొసైటీలో అమ్మాయిలు ఏ రంగంలో ఎదగాలన్నా కమిట్‌మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితులను ఇందులో చూపించారు. ఇక 'ఏ తండ్రి అయినా తన కూతురికి కాళ్లు కడిగి కన్యాదానం చేస్తూ చాలా ఆనందపడతాడు. కానీ ఇప్పుడు తను నిజంగా కన్యనే దానం చేస్తున్నాడా? అనే ఫీలింగ్ వస్తోంది', 'సమాజంలో మగాడు ఎట్లైనా బతుకుతడు, కానీ ఆడది యుద్ధం చేస్తేనే బతుకుతది' వంటి డైలాగ్స్ ఆలోచింపజేస్తున్నాయి. నరేష్ కుమరన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆగస్టు 19న థియేటర్లలో విడుదల కానుంది.

Next Story

Most Viewed