ఆగస్టు 19న 'కమిట్‌మెంట్'.. ఆదరించాలన్న నిర్మాతలు

by Disha Web Desk 7 |
ఆగస్టు 19న కమిట్‌మెంట్.. ఆదరించాలన్న నిర్మాతలు
X

దిశ, సినిమా : తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, అభయ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'కమిట్‌మెంట్'. లక్ష్మీకాంత్ చెన్న దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన టీజ‌ర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తుండగా తాజాగా మరో గుడ్‌న్యూస్ చెప్పారు మేకర్స్. ఆగస్టు 19న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన నిర్మాతలు నీలిమ తాడూరి, బల్దేవ్ సింగ్.. ప్రేక్షక దేవుళ్లు తమ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. ఇక రచన మీడియా వర్క్స్ సమర్పణలో ఎఫ్ 3 ప్రొడక్షన్స్, ఫుట్ లూస్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి నరేష్ కుమారన్ సంగీతం అందించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed