- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రంగు మారే కండోమ్స్.. లైంగిక వ్యాధులను గుర్తించే సరికొత్త టెక్నాలజీ!
లైంగిక వ్యాధులను గుర్తించే ‘S.T. EYE’ కలర్ కండోమ్స్! బాక్టీరియాను బట్టి రంగు మారే వినూత్న టెక్నాలజీని రూపొందించిన బ్రిటన్ విద్యార్థులు.

దిశ, వెబ్ డెస్క్: బ్రిటన్‌కు చెందిన ముగ్గురు పాఠశాల విద్యార్థులు ఒక వినూత్నమైన ఆలోచనను తెరపైకి తెచ్చారు. లైంగిక సంబంధిత వ్యాధులను (STIs) ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు రంగులు మారే కండోమ్స్ (Color-changing condoms)ను తయారు చేశారు. ఈస్ట్ లండన్‌లోని ఐజాక్ న్యూటన్ అకాడమీకి చెందిన దాన్యాల్ అలీ, మువాజ్ నవాజ్, చిరాగ్ షా అనే విద్యార్థులు ‘S.T. EYE’ పేరుతో రంగులు మార్చే కండోమ్స్‌ను అభివృద్ధి చేశారు. ఈ కండోమ్‌లు శరీరంలోని బాక్టీరియా, వైరస్‌లతో స్పందించినప్పుడు రసాయన చర్య జరిపి, ఇన్ఫెక్షన్‌ను బట్టి రంగు మారుతాయి. దీనివల్ల క్లిష్టమైన పరీక్షలు లేకుండానే ప్రాథమికంగా వ్యాధి ఉనికిని గుర్తించి, వెంటనే డాక్టరును సంప్రదించే అవకాశం కలుగుతుంది.
ఈ సాంకేతికత ప్రకారం, కండోమ్ ఉపరితలంపై ఉండే ప్రత్యేకమైన అణువులు నిర్దిష్ట బాక్టీరియాతో కలిసినప్పుడు వేర్వేరు రంగులను ప్రదర్శిస్తాయి. ఉదాహరణకు, గ్రీన్ కలర్ వస్తే క్లామిడియా, బ్లూ వస్తే సిఫిలిస్, పర్పుల్ వస్తే హెచ్‌పీవీ (HPV), ఎల్లో కలర్ వస్తే హెర్పెస్ సోకినట్లు అర్థం చేసుకోవచ్చు. ఈ వినూత్న కాన్సెప్ట్‌కు గాను ఈ విద్యార్థులు లండన్‌లో జరిగిన 'టీన్-టెక్' (TeenTech) అవార్డులలో ఉత్తమ ఆరోగ్య ఆవిష్కరణ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఇది ఒక కాన్సెప్ట్ రూపంలో ప్రయోగ దశలోనే ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ఇది సామాజిక ఆరోగ్య రంగంలో, సురక్షిత శృంగారం పట్ల అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు.






