- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీలిమిటేషన్’ ముప్పు ముంగిట ఉంది.. తమిళనాడుకు ద్రోహం చేస్తే ఊరుకోం: సీఎం స్టాలిన్
నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు! దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ఊరుకోమని కేంద్రానికి హెచ్చరిక.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సౌత్ రాష్ట్రాల్లో డీలిమిటేషన్ పై జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశం ఇప్పుడు తమిళనాడు గుమ్మం వరకు చేరుకుందని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు పెను ప్రమాదమని హెచ్చరిస్తూ ఆయన ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఎన్నికల ప్రచారంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ హెచ్చరిక జారీ చేయడం తన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఏప్రిల్ 16న (ఎల్లుండి) పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను కేంద్రం బలవంతంగా నిర్వహిస్తోందని, ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల మధ్యలో ఇలా చేయడం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు.
దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం..
నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకుండా చూస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్‌లో స్పష్టమైన హామీ ఇవ్వాలని తాము డిమాండ్ చేసినా, ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదని స్టాలిన్ మండిపడ్డారు. ఈ సమస్యపై చర్చించడానికి వివిధ పార్టీల ఎంపీలు ప్రధానిని కలిసేందుకు సమయం కోరినప్పటికీ నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాజకీయ పార్టీని సంప్రదించకుండా, ఏకపక్షంగా రాజ్యాంగ సవరణలు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఈ సందర్భంగా సీఎం ధ్వజమెత్తారు.
ఉమ్మడి పోరాటానికి పిలుపు..
నియోజకవర్గాల పునర్విభజనపై దేశవ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నామని, ఇప్పటికే ప్రభావితమయ్యే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన పార్టీలతో చెన్నైలో 'జాయింట్ యాక్షన్ కమిటీ' సమావేశాన్ని నిర్వహించినట్లు స్టాలిన్ గుర్తు చేశారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలకు శిక్ష విధిస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. తమిళనాడు ప్రయోజనాలను దెబ్బతీసేలా కేంద్రం అడుగులు వేస్తే చూస్తూ ఊరుకోబోమని, పార్లమెంట్‌లోనూ, ప్రజాక్షేత్రంలోనూ తమ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ కేంద్రాన్ని హెచ్చరించారు.






