- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీలిమిటేషన్ బిల్లు ప్రతుల దహనం! బీజేపీ అహంకారాన్ని అణచివేస్తామన్న సీఎం స్టాలిన్
డీలిమిటేషన్ బిల్లు ప్రతులను తగులబెట్టిన సీఎం స్టాలిన్! బీజేపీ అహంకారాన్ని అణచివేస్తామని హెచ్చరిక. తమిళనాడులో నల్లజెండాలతో డీఎంకే నిరసన.

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)పై తీవ్ర చర్చ జరుగుతుండగా.. తమిళనాడులో మాత్రం ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో డీలిమిటేషన్ బిల్లుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ (M.K. Stalin) నిరసన గళం విప్పారు. ఈ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాబల్యం తగ్గుతుందని ఆరోపిస్తూ, ఆయన బహిరంగంగా బిల్లు ప్రతులను తగులబెట్టి సంచలనం సృష్టించారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ.. ఈ మంటలు కేవలం కాగితాలను కాల్చడం లేదని, ఇవి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అహంకారాన్ని అణచివేస్తాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసినందుకు దక్షిణ రాష్ట్రాలను శిక్షించేలా ఈ బిల్లు ఉందని ఆయన మండిపడ్డారు.
ముఖ్యమంత్రి పిలుపుతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. డీఎంకే శ్రేణులు ప్రధాన కూడళ్లు, పార్టీ కార్యాలయాలపై నల్లజెండాలను ఎగురవేసి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాలరాసే ఏ ప్రయత్నాన్నైనా అడ్డుకుంటామని, ఈ పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని డీఎంకే నేతలు స్పష్టం చేశారు. సీఎం స్టాలిన్ తీసుకున్న ఈ దూకుడు నిర్ణయం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.






