అండర్-19 విశ్వవిజేతలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

by Muthe.Rajitha |

అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.

అండర్-19 విశ్వవిజేతలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
X

దిశ, వెబ్ డెస్క్ : అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. విశ్వ వేదికపై మన క్రీడాకారుల విజయ పరంపర దేశానికి గర్వకారణమన్నారు. యువ ఛాంపియన్ల అసమాన ప్రతిభ భారత క్రికెట్ భవిష్యత్తుకు మరింత భరోసానిస్తోందన్నారు. అంకితభావం, నైపుణ్యం, పోరాట పటిమలో గత తరం క్రీడాకారుల స్ఫూర్తిని కొనసాగిస్తూనే, ఈనాటి యువత అత్యంత ఆత్మవిశ్వాసంతో అంతర్జాతీయ వేదికపై భారత కీర్తిని చాటడం అభినందనీయమని ముఖ్యమంత్రి ప్రశంసించారు. కాగా శుక్రవారం ఇంగ్లండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచులో 100 పరుగుల తేడాతో టీమ్ ఇండియా జట్టు విక్టరీ సాధించి, కప్పు సొంతం చేసుకుంది.

Next Story