- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పద్మ’ అవార్డు గ్రహీతలకు CM రేవంత్ శుభాకాంక్షలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది.

దిశ, వెబ్‌డెస్క్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈసారి 5 మందికి పద్మ విభూషన్, 13 మందికి పద్మ భూషన్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. పద్మశ్రీ వచ్చిన వారిలో 11 మంది తెలుగు వారు ఉన్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల నుండి ఎంపికైన ప్రముఖులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు నోరి దత్తాత్రేయుడుకి పద్మ భూషణ్, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం నుంచి గడ్డమణుగు చంద్రమౌళి, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్, కుమారస్వామి తంగరాజ్, వైద్య రంగంలో గూడూరు వెంకట్ రావు, పాల్కొండ విజయానంద్ రెడ్డి, పశుసంవర్థక రంగంలో మామిడి రామా రెడ్డి, విద్యా-సాహిత్య రంగాల నుండి మామిడాల జగదీశ్ కుమార్, వెంపటి శశి శేఖర్, వెంపటి కుటుంబ శాస్త్రి, కళా రంగం నుంచి దీపికా రెడ్డి, మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌లకు పద్మశ్రీ పురస్కారాలు దక్కడం హర్షించదగ్గ విషయం. ఇది తెలుగువారికి గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.






