CM KCR Aerial Survey: భద్రాచలంలో సీఎం ఏరియల్ సర్వే

by GSrikanth |   (  Updated:2022-07-16 07:08:48  IST  )

CM KCR Aerial Survey In Bhadrachalam On July 17| 10 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అవుతుంది. పోటెత్తిన వరదల కారణంగా పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తద్వారా గోదావరి పరివాహక ప్రాంతాల్లో పోటెత్తిన

CM KCR will leave for Warangal
X

దిశ, వెబ్‌డెస్క్: CM KCR Aerial Survey In Bhadrachalam On July 17| 10 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అవుతుంది. పోటెత్తిన వరదల కారణంగా పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తద్వారా గోదావరి పరివాహక ప్రాంతాల్లో పోటెత్తిన వరదల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ నెల 17 ఉదయం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. సీఎం ఏరియల్ సర్వే కడెం నుంచి భద్రాచలం వరకున్న గోదావరి పరివాహక ప్రాంతంలో కొనసాగనున్నది. దీనికి సంబంధించిన అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తోంది. సీఎం ఏరియల్ సర్వేకు సంబంధించిన విధి విధానాలను పర్యవేక్షించి హెలికాప్టర్ రూట్ ను ఫైనల్ చేయనున్నారు. సర్వేలో భాగంగా గోదావరి పరివాహక ప్రాంతాలో జరుగుతున్న సహాయక కార్యక్రమాలను సీఎం నేరుగా పర్యవేక్షించనున్నారు. ఈ సర్వేలో సీఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పాల్గొననున్నారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్ కు పోటీగా గవర్నర్.. భద్రాచలం పర్యటనకు తమిళి సై

Next Story