- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంచి మిత్రుడుని కోల్పోయాను.. అజిత్ పవార్ మృతిపై సీఎం ఫడ్నవీస్ తీవ్ర దిగ్బ్రాంతి
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈ రోజు ఉదయం బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటన పై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈ రోజు ఉదయం బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటన పై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఉదయం జరిగిన ఈ విషాద ఘటన 'నమ్మశక్యం కానిది' అని అభివర్ణించారు. అజిత్ పవార్ మృతికి గౌరవసూచికంగా మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు అధికారిక సంతాప దినాలను ప్రకటించడమే కాకుండా.. ఈ రోజు (జనవరి 28) ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది.
పూడ్చలేని లోటు - ఫడ్నవీస్ భావోద్వేగం
డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సీఎం ఫడ్నవీస్ కన్నీటి పర్యంతమయ్యారు. "నేను ఒక మంచి మిత్రుడిని కోల్పోయాను. ఆయన మరణం రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నటికీ పూడ్చలేని శూన్యాన్ని మిగిల్చింది. మేమిద్దరం కలిసి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. కలిసి పనిచేశాం. ఆయన ఇక లేరు అన్న వార్తను నా మనస్సు అంగీకరించలేకపోతోంది" అని భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే అజిత్ పవార్‌ను ఒక గొప్ప పరిపాలనా దక్షుడిగా ఫడ్నవీస్ కొనియాడారు. "అజిత్ పవార్ ప్రజల మనిషి. రాష్ట్ర సమస్యలపై ఆయనకు అపారమైన అవగాహన ఉంది. అటువంటి నాయకత్వాన్ని నిర్మించుకోవడానికి దశాబ్దాల కాలం పడుతుంది. ఆయన మృతి కేవలం నా వ్యక్తిగత నష్టం మాత్రమే కాదు, యావత్ మహారాష్ట్రకు తీరని లోటు" అని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పేర్కొన్నారు.






