- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉగాది వేళ సీఎం చంద్రబాబు ఉదారత: సీఎంఆర్ఎఫ్‌పై తొలి సంతకం.. 6,787 మందికి ఊరట!
ఉగాది కానుకగా రూ.55.63 కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదలపై సీఎం చంద్రబాబు తొలి సంతకం. 6,787 మంది పేదలకు పండుగ వేళ ఆర్థిక భరోసా.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగలను పురస్కరించుకుని సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) పేదల పట్ల తనకున్న మక్కువను చాటుకున్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ఆపదలో ఉన్న నిరుపేదలను ఆదుకోవడమే లక్ష్యంగా ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) దస్త్రంపై ఈరోజు తొలి సంతకం చేశారు. దీని ద్వారా సుమారు 6,787 మంది లబ్ధిదారులకు రూ. 55.63 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పండుగ పూట వేల కుటుంబాల్లో వెలుగులు నింపుతూ సీఎం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ఆదర్శంగా నిలుస్తున్న చంద్రబాబు!
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన గత 21 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు సీఎంఆర్ఎఫ్ ద్వారా రికార్డు స్థాయిలో 1,36,240 మందికి అండగా నిలిచారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ పేదలకు మెరుగైన వైద్యం, ఇతర అవసరాల కోసం నిధుల విడుదలలో ఎక్కడా వెనకాడటం లేదు. కాగా, ఉగాది పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రికి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా అర్చకులు ఆకాంక్షించారు.






