- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోల్‌కతాకు సీఎం చంద్రబాబు.. బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరు
ఏపీ సీఎం చంద్రబాబు రేపు కోల్‌కతాలో పర్యటించనున్నారు. బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార వేడుకలో పాల్గొనేందుకు ఆయన విజయవాడ నుండి ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (శనివారం) పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్లనున్నారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఈ పర్యటన కోసం చంద్రబాబు రేపు ఉదయం 7:05 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరి, ఉదయం 7:40 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కోల్‌కతాకు పయనమవుతారు. ఉదయం 9:20 గంటలకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నేరుగా కార్యక్రమ వేదికకు చేరుకుంటారు.
ఉదయం 11:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. బెంగాల్ కొత్త ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపిన అనంతరం, మధ్యాహ్నం 1:45 గంటలకు కోల్‌కతా నుండి తిరుగు ప్రయాణమవుతారు. మధ్యాహ్నం 3:45 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న సీఎం, అక్కడి నుండి జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకుంటారు. దేశ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న చంద్రబాబు, బెంగాల్‌లో బీజేపీ చారిత్రక విజయానంతరం జరుగుతున్న ఈ వేడుకకు హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది.






