- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్లు శిరీష్ దంపతులను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు
by Muthe.Rajitha |
ఇటీవల వివాహం చేసుకున్న అల్లు శిరీష్ - నయనిక దంపతులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా వారి నివాసంలో కలిసి ఆశీర్వదించారు.

X
దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ - నయనికల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, నూతన దంపతులను ఆశీర్వదించేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వయంగా అల్లు అరవింద్ నివాసానికి వెళ్లారు. అల్లు శిరీష్ - నయనిక దంపతులను కలిసిన చంద్రబాబు, వారికి శుభాకాంక్షలు తెలిపి నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు. కాగా తమ నివాసానికి విచ్చేసిన చంద్రబాబు నాయుడికి అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ సీఎంను శాలువాతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. చాలా కాలంగా అల్లు కుటుంబానికి, నారా కుటుంబానికి మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ భేటీ మరోసారి గుర్తు చేసింది. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు పలువురు సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు.
Next Story






