రేపు సీఎం రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ మీటింగ్

by Muthe.Rajitha |

అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై రేపు సీఎం రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ మీటింగ్ జరగనుంది.

రేపు సీఎం రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ మీటింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు రేపు కాంగ్రెస్ శాసన సభా పక్ష సమావేశం జరగనున్నది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశం అసెంబ్లీలోని కమిటి హాల్ 1లో మధ్యాహ్నం రెండు గంటలకు పార్టీ నిర్వహించనున్నది. ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన తర్వాత సభ వాయిదా పడనున్నది. అనంతరం సీఎల్పీ మీటింగ్ ను కాంగ్రెస్ నిర్వహించనున్నది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈనెలాఖరు వరకూ సుదీర్ఘంగా జరుగుతాయన్న భావిస్తున్నారు. కాగా, ఈ సమావేశాల్లో అనేక అంశాలు ప్రభుత్వం ముందుకు విపక్షాలు తీసుకువచ్చేందుకు సిద్ద పడుతుండగా వారి ఆరోపణలు, విమర్శలను ధీటుగా ఎదుర్కొనేలా సీఎల్పీ భేటీలో సీఎం, మంత్రులు వారికి దిశా నిర్దేశం చేయనున్నారు.

Next Story